రాయ్‌పూర్: ఒక పెళ్లి బృందం డ్యాన్సులతో ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్తున్నది. ఇంతలో ఒక లారీ వారిపైకి దూసుకొచ్చింది. మహిళలతో సహా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Truck Runs Over Dancing In Baraat) ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక పెళ్లి బృందంలోని మహిళలు, పురుషులు డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఎంతో సంతోషంగా పెళ్లి వేదిక వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు.
కాగా, ఉన్నట్టుండి పెళ్లి బృందంపైకి ఒక లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఒక వ్యక్తికి వెన్నెముక విరిగింది. ఇద్దరు మహిళలకు కాళ్ళు, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి బృందంపైకి లారీ దూసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍 बिर्रा (जाँजगीर)
जिला अध्यक्ष तारा देवांगन के चचेरे भाई की बारातियों को खड़ी कैप्सूल ट्रक ने अचानक स्टार्ट कर बारातियों को कुचलने की कोशिश, चालक फरार।
यह हादसा प्रशासन की लचर ट्रैफिक व्यवस्था व पुलिस लापरवाही का नतीजा है।
❓साय सरकार में क्या आम जनता की जान की कोई कीमत नहीं? pic.twitter.com/r3EZAufMXb— Chandradev Rai (@Chandradevinc) February 10, 2026
Also Read:
Air India fined | పర్మిట్ లేకుండా ఎయిర్‌బస్ నడిపిన ఎయిర్ ఇండియా.. కోటి జరిమానా
Elephants Trampled | ఏనుగుల దాడి.. ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురి మృతి
Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు