Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు
Thief Targeted Only Cops' Homes | పోలీస్ తనను కొట్టడంపై ఒక వ్యక్తి పగ పెంచుకున్నాడు. పోలీస్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
భోపాల్: పోలీస్ తనను కొట్టడంపై ఒక వ్యక్తి పగ పెంచుకున్నాడు. పోలీస్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Thief Targeted Only Cops’ Homes) మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 20న ఖాండ్వాలోని పోలీస్ క్వాటర్స్‌లో దొంగతనాలు జరిగాయి. కానిస్టేబుల్స్ కరణ్‌పాల్ సింగ్, సురేష్ ఖాటే ఇళ్లలో రాత్రి సమయంలో దొంగలు పడ్డారు. లక్షలాది విలువైన నగలతో పాటు డబ్బు దొంగిలించారు.
కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన దీపేష్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడి కోసం పలు జిల్లాల్లో వెతికారు. పోలీసుల కళ్లగప్పి అతడు తప్పించుకోసాడు.
అయితే బుర్హాన్పూర్ వైపు దీపేష్ ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయేందుకు వాహనం టాప్ నుంచి దూకాడు. గాయపడిన అతడికి చికిత్స అందించిన తర్వాత అరెస్ట్ చేశారు.
మరోవైపు దీపేష్‌ను పోలీసులు ప్రశ్నించగా ఆసక్తికర విషయం బయటపడింది. 15 ఏళ్ల కిందట అలీరాజ్‌పూర్‌లో ఒక పోలీస్ అతడ్ని కొట్టాడు. దీంతో నాటి నుంచి పోలీసులపై అతడు పగ పెంచుకున్నాడు. పోలీస్ ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు. వీధి వ్యాపారిలాగా పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నాడు. పరారీలో ఉన్న సహ నిందితులు రమేష్, భూరాలియా కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Kills Mother | చేతబడి వల్ల తండ్రి మరణించాడన్న జ్యోతిష్కుడు.. తల్లిని చంపిన కుమార్తె
Watch: ఐదుగురిపైకి కారు దూకించిన విద్యార్థి.. ఆరేళ్ల బాలుడు మృతి
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

