కారేపల్లి, ఆగస్టు 12 : అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ మృతదేహానికి పలువురు నాయకులు, ఉన్నత అధికారులు నివాళులర్పించారు. కారేపల్లి మండల పరిధిలోని వికిత్యా తండాలో బుధవారం నవీన్ అంత్యక్రియలు జరిగాయి. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు లావుడియా రాములు నాయక్, బానోతు చంద్రావతితో పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్ తోపాటు అటవీశాఖ ఉన్నత అధికారులు, నవీన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నవీన్ తండ్రి దేవులా నాయక్ మాజీ ఎంపీపీ, జడ్పిటిసి కాగా తల్లి బూలీ ప్రస్తుతం వెంకటియా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కలెక్టర్ తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారు. నవీన్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ నాయక్‌కు ఘన నివాళి