Vemula Prashanth Reddy | అసెంబ్లీ సమావేశాలు దుశ్శాసన పర్వాన్ని తలపించాయని.. ప్రధాన ప్రతిపక్షం గొంతు అసెంబ్లీలో వినిపించకుండా కుట్ర చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. వన్ సైడ్ అసెంబ్లీ సమావేశాలు జరుపుకుని ప్రజాస్వామ్య బద్దంగా నడిపామని శ్రీధర్ బాబు అంటున్నారు. ఆత్మస్తుతి పరనింద తప్ప అసెంబ్లీలో ఏమీ జరగలేదు. 463 పేజీల క్యూర్ బిల్లును అర్ధ గంటలో పాస్ చేశారు. హామీల అమలులో విఫలం అనే టీ షర్టులు వేసుకుంటే తప్పు ఏంటి…? రాహుల్ గాంధీ రాతలు, ఫోటోలు ఉన్న టీ షర్టులు వేసుకుని ఎందుకు పార్లమెంట్ కు వెళ్లారు. దేశంలో అన్ని అసెంబ్లీలు పార్లమెంట్ సాంప్రదాయాలు పాటిస్తాయి. మమ్మల్ని అసెంబ్లీ గేటు వద్ద ఎందుకు ఆపారు. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు నులిమిన పోలీసులపై ఎందుకు కేసు పెట్టలేదు. డీజీపీ ఆటవిక రాజ్యం నడుపుతున్నారు . చావు డప్పు పేరుతో కేసీఆర్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి తొత్తులుగా మారారు. రేవంత్ రెడ్డికి పెయిడ్ బ్యాచ్ లా పోలీసులు మారారని ఎమ్మెల్యే వేముల ఫైర్ అయ్యారు.
మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బీజేపీ వాళ్లను అసెంబ్లీలో పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి అసెంబ్లీని నడిపించుకున్నారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ రెడ్డిగా మారారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. రేవంత్ రెడ్డి గురువుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటన్నారు.
కేటీఆర్ ఇచ్చిన ఆఫర్ కు రేవంత్ రెడ్డి సిద్ధమా…?
కేసీఆర్ కుటుంబం ఆస్తులు, రేవంత్ రెడ్డి కుటుంబం ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నారా..? అని ఎమ్మెల్యే వేముల ప్రశ్నించారు. కేసీఆర్ 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదని తేలితే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా…? కేసీఆర్ 300 ఎకరాల భూమి కబ్జా చేశారని తేలితే మేము అంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ ఇచ్చిన ఆఫర్ కు రేవంత్ రెడ్డి సిద్ధమా…? అని సవాల్ విసిరారు.
భూముల వద్దకు వెళ్ళడానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఏం సంబంధమని వేముల ప్రశ్నించారు. జణ్వాడ భూముల వద్దకు వెళ్లడానికి ప్రజా భవన్ లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు. కేసీఆర్,కేటీఆర్,హరీష్ భూముల వద్దకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను పంపడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మన్నే క్రిశాంక్ ఇంటి తాళాలు పగలగొట్టారు.. మీరు పోలీసులా..? దొంగలా..? రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి బయటకు రావద్దని ఇదంతా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి మొఘల్ చక్రవర్తి,హిట్లర్ లా వ్యవహరిస్తున్నారు అని ఫైర్ అయ్యారు.
కేటీఆర్ జణ్వాడ భూములు,హరీష్ రావు భూములు ఇప్పుడు కొనుక్కున్నవి కావు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మరు. దానం నాగేందర్ లాగా పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. రేవంత్ రెడ్డి లక్కీ భాస్కర్ సీఎం. పచ్చ కాంగ్రెసోళ్ల చేతిలో అచ్చ కాంగ్రెసోళ్లు అతలాకుతలం అవుతున్నారు. అచ్చ కాంగ్రసోళ్ళు రేవంత్ రెడ్డిని మార్చి వేరే సీఎంను పెట్టుకోండిన హితవు పలికారు.
గద్దెనెక్కిన మూడేండ్ల నుండి..
కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేస్తూ..
‘రేవంత్ రెడ్డి’ కాస్తా ‘రిబ్బన్ కటింగ్ రెడ్డి’గా మారిండు.– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS pic.twitter.com/qVQ07VrRce
— BRS Party (@BRSparty) September 19, 2026
Plank Exercise | రోజుకు 60 సెకన్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ తగ్గుతుంది.. నిపుణుల వెల్లడి..
RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు!
iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్ 18ప్రో.. భారత్లో మొదలైన 18 సిరీస్ అమ్మకాలు..!