‘ప్రతి ఒక్కరూ సేవాభావం అలవరుచుకోవాలి’
అన్నం పరబ్రహ్మ స్వరూపం వంటిదని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం నాయుడుపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమం..
– మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ తిరుపతిరెడ్డి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 19 : అన్నం పరబ్రహ్మ స్వరూపం వంటిదని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం నాయుడుపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కమిషనర్, ఏసిపి, సీఐలు ముష్కరాజ్, సంజీవ్ హాజరయ్యారు. తొలుత గణేష్ మండపంలో సిద్ధి వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండటం అలవర్చుకోవాలన్నారు. అన్నదానం వంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకునే విధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చొరవ తీసుకోవాలని, విజయవంతం చేసే విధంగా ప్రజలు సహకరించాలని వారు సూచించారు. క్రమంలో పలువురు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

