బూర్గంపహాడ్, సెప్టెంబర్ 19 : బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న రెంటపల్లి స్వామి కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన బూర్గంపహాడ్ పోలీస్టేషన్లో ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్ఐగా పదోన్నతి పొందిన స్వామిని ఎస్ఐలు మేడా ప్రసాద్, నాగభిక్షం, రామ్మూర్తి, స్టేషన్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.