జర్నలిస్ట్ రబ్బానిపాషా కుటుంబానికి చెక్కు అందజేత
హనుమకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌కు చెందిన ప్రతీ సభ్యుడి సంక్షేమమే తమ కమిటీ ధ్యేయమని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన క్లబ్ సభ్యుడు రబ్బానిపాషా కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కంపెనీ ద్వారా కుటుంబ సభ్యులకు రూ.10.57 లక్షలు చెక్కును బుధవారం అందజేశారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 12: గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌కు చెందిన ప్రతీ సభ్యుడి సంక్షేమమే తమ కమిటీ ధ్యేయమని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన క్లబ్ సభ్యుడు, డెస్క్ జర్నలిస్టు రబ్బానిపాషా కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కంపెనీ ద్వారా కుటుంబ సభ్యులకు రూ.10.57 లక్షలు చెక్కును బుధవారం అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోనేఎక్కడాలేని విధంగా జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అందించిన ఘనత గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌కు, టీయూడబ్ల్యూజే-ఐజేయూ యూనియన్‌కే దక్కిందన్నారు.
సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు చేయించిన బీమా, ఒక కుటుంబానికి ఆసరాగా నిలవటం గొప్ప విషయమన్నారు. గత ఏడాది సభ్యులకు చేసిన బీమాను ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేయించేందుకు తమ కమిటీ నిర్ణయించిందని, ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రబ్బానిపాషా కుటుంబానికి క్లబ్ అండగా నిలుస్తుందని వారికి, ఇన్సూరెన్స్ పాలసీ కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొళ్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాంకుమార్, బొడిగె శ్రీను, అల్లం రాజేష్‌వర్మ, యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలు, సంపేట సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, పోడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ సభ్యులు, వీరగోని హరీష్, జనగాని ఆంజనేయులు, ఎండి నయీంపాషా, కమటం వేణుగోపాల్, భరత్ కుమార్, మంచాల రాజు, బలువారి విజయరాజ్, టీయూడ్ల్యూజే-ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, గుల్షన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్సురెన్స్ ప్రతినిధులు బీమా విశిష్టతను, ఇన్సూరెన్స్ చేసిన పాలసీ ప్రయోజనాలను వివరించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

