9 నెలల్లో 1.76 లక్షల ఉద్యోగాల కోత
ప్రపంచవ్యాప్తంగా 2026లో ఉద్యోగాల కోతలు టెక్నాలజీతో పాటు ఆటోమొబైల్, బ్యాంకింగ్, రిటైల్, మీడియా, గేమింగ్ తదితర రంగాలకూ విస్తరించాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, సంస్థాగత నిర్మాణాలను సరళీకరించడం, వ్యాపార నమూనాలను మార్చుకోవడం, కృత్రిమ మేధ(ఏఐ)లో పెట్టుబడులు పెంచడం వంటి కారణాలతో ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ 23 వరకు వెల్లడైన సంఖ్యలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 1.76 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి.
- ఏఐతో మారుతున్న ఉద్యోగ ప్రపంచం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2026లో ఉద్యోగాల కోతలు టెక్నాలజీతో పాటు ఆటోమొబైల్, బ్యాంకింగ్, రిటైల్, మీడియా, గేమింగ్ తదితర రంగాలకూ విస్తరించాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, సంస్థాగత నిర్మాణాలను సరళీకరించడం, వ్యాపార నమూనాలను మార్చుకోవడం, కృత్రిమ మేధ(ఏఐ)లో పెట్టుబడులు పెంచడం వంటి కారణాలతో ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ 23 వరకు వెల్లడైన సంఖ్యలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 1.76 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి.
అమెజాన్, అట్లాసియన్, ఇంట్యూట్ వంటి సంస్థలు ఏఐలో పెట్టుబడులు, సంస్థాగత మార్పులను ఉద్యోగాల కోతలకు కారణాలుగా పేర్కొన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఉద్యోగ కోతకు ఏఐనే కారణమని చెప్పడం సరికాదు. బలహీనమైన డిమాండ్, అధిక నిర్వహణ వ్యయాలు, కొవిడ్ తర్వాత అధిక నియామకాలు, మారుతున్న వ్యాపార విధానాలు, ఉత్పాదకత పెంచాల్సిన ఒత్తిడి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్‌లో ఆరోసారి ఉద్యోగాల కోత
మైక్రోసాఫ్ట్‌లో మరోవిడత ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సుమారు 500 మందిపై ఈ ప్రభావం పడింది. వీరిలో ఎక్కువమంది ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగానికి చెందినవారు కాగా, క్లౌడ్, కృత్రిమ మేధ విభాగాల్లో కొద్దిమంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. జూలైలో మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో 2.1 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

