బెంగళూరు : దుబాయ్‌లోని షార్జాలో భారతీయుడి హత్య తీవ్ర కలకలం రేపుతున్నది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా ఉదయవార్కు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ 14 ఏండ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. షార్జాలోని ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాడు. భార్య టీనీ కుందర్, కొడుకు కూడా అతనితోనే ఉంటున్నారు. గత జూలై నెలలో ప్రకాశ్ సోదరుడు అనిల్ చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడాడు.
ఆ తర్వాత ప్రకాశ్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా రిైప్లె రాలేదు. దీంతో అనిల్ దుబాయ్‌లోని తన స్నేహితుడు మనోహర్‌కు కాల్ చేసి విషయం చెప్పాడు. ప్రకాశ్ ఉంటున్న ఇంటికి, పనిచేసే చోటకు వెళ్లి ఆరా తీయగా.. ఇండియాకు వెళ్లిపోయాడంటూ చెప్పారు. దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో అతని ఇంట్లోనే ప్రకాశ్ కుందర్ మృతదేహం 9 ముక్కలుగా కనిపించింది. రెండు బ్యాగుల్లో అతని శరీర భాగాలను దాచారు. భార్య, కొడుకు ఆచూకీ దొరకలేదు.