Woman Kills Mother | చేతబడి వల్ల తండ్రి మరణించాడన్న జ్యోతిష్కుడు.. తల్లిని చంపిన కుమార్తె
Woman Kills Mother | తల్లి చేయించిన చేతబడి వల్ల తండ్రి మరణించినట్లు ఒక జ్యోతిష్కుడు తెలిపాడు. దీనిని బలంగా నమ్మిన కుమార్తె తన తల్లిని హత్య చేసింది. హడావుడిగా అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బెంగళూరు: తల్లి చేయించిన చేతబడి వల్ల తండ్రి మరణించినట్లు ఒక జ్యోతిష్కుడు తెలిపాడు. దీనిని బలంగా నమ్మిన కుమార్తె తన తల్లిని హత్య చేసింది. హడావుడిగా అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. (Woman Kills Mother) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తుమకూరు నగరంలో భర్తతో కలిసి నివసిస్తున్న 33 ఏళ్ల సుచిత్ర తండ్రి ఏడాదిన్నర కిందట మరణించాడు.
కాగా, సుచిత్ర ఇటీవల ఒక జ్యోతిష్కుడిని సంప్రదించింది. 55 ఏళ్ల ఆమె తల్లి పుష్పవతి చేతబడి చేయించడం వల్ల తండ్రి మరణించినట్లు ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. సుచిత్ర దీనిని బలంగా నమ్మింది. అనుపనహళ్లి గ్రామంలో నివసించే తల్లి ఇంటికి ఆమె చేరుకున్నది. బుధవారం రాత్రి నిద్రిస్తున్న పుష్పవతి ముఖంపై దిండితో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపింది.
అనంతరం తన తల్లి సహజంగా మరణించినట్లు నమ్మించేందుకు సుచిత్ర ప్రయత్నించింది. తల్లి మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహిచేందుకు ప్రయత్నించింది. అయితే పుష్పవతి శరీరంపై గాయాల గుర్తులు ఉండటంతో ఆమె మరణంపై స్థానికులు అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పుష్పవతి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. సుచిత్రను ప్రశ్నించగా జ్యోతిష్కుడి మాటలు నమ్మి తల్లిని తానే చంపినట్లు ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ హత్యలో ఆమె భర్త పాత్ర ఏమైనా ఉన్నదా? అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: ఐదుగురిపైకి కారు దూకించిన విద్యార్థి.. ఆరేళ్ల బాలుడు మృతి
Watch: రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ.. వీడియో వైరల్తో కానిస్టేబుల్స్ సస్పెండ్
Woman’s Half-Burnt Body In Suitcase | హైవే పక్కన సూట్కేస్.. అందులో సగం కాలిన యువతి మృతదేహం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Astrologer
- Black Magic
- claims
- death
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

