న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు మరోసారి భారీ జరిమానా విధిచింది. ఎయిర్ వర్తీనెస్ పర్మిట్ లేకుండా ఎయిర్‌బస్‌ను 8 సార్లు నడిపినందుకు కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. (Air India fined) గత ఏడాది నవంబర్ 24, 25 తేదీల్లో తప్పనిసరి ఎయిర్‌వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ (ఏఆర్సీ) లేకుండా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మధ్య ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని ఎయిర్ ఇండియా 8 సార్లు నడిపింది.
కాగా, గత ఏడాది డిసెంబర్లో రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా అంతర్గత దర్యాప్తు చేపట్టింది. వ్యవస్థాగత వైఫల్యాలను గుర్తించింది. ఈ లోపాల కారణంగా ప్రజల విశ్వాసాన్ని ఎయిర్ ఇండియా దెబ్బతీసిందని, ప్రయాణికుల భద్రతను ఆ సంస్థ ప్రభావితం చేసిందని డీజీసీఏ ఆరోపించింది. ఈ నేపథ్యంలో భారీ జరిమానా విధించింది. 30 రోజుల్లోపు రూ.కోటి డిపాజిట్ చేయాలని ఫిబ్రవరి 5న ఆదేశించింది.
Also Read:
Elephants Trampled | ఏనుగుల దాడి.. ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురి మృతి
Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు