ఢిల్లీ : వచ్చేనెలలో భారత పర్యటనకు రానున్న అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐని కోరినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో సెప్టెంబర్ 13 (ఆదివారం), 15 (మంగళవారం), 17 (గురువారం)న మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంది.
అయితే ఈ షెడ్యూల్లో తొలి లేదా రెండో మ్యాచ్ను 14కు మార్చాలని ఏసీబీ కోరుతున్నట్టు సమాచారం. సోమవారం గణేశ్ చతుర్థి సెలవుదినం కావడంతో ఆ రోజు మ్యాచ్ చూసేందుకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తున్నది. మరి ఏసీబీ ప్రతిపాదనను బీసీసీఐ ఒప్పుకుంటుందా? లేదా? అనేది త్వరలో తేలనుంది.