న్యూఢిల్లీ : ఓ వైపు ప్రపంచమంతా ఏఐ క్లాసులు, డిజిటల్ క్లాసులు అంటూ తమ విద్యార్థులను తీసుకెళ్తుంటే.. ఇండియాలో మాత్రం విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. ఈ విషయాలను 18వ లోక్సభ ఎస్టిమేట్స్ కమిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తన 10వ నివేదికలో వెల్లడించింది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత స్థాయి సెకండరీ విద్యకు వచ్చేలోపు 73 శాతం విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నట్టు నివేదికలో తేలింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయి పాఠశాలలు 9,11,032 ఉంటే.. అప్పర్ ప్రైమరీ స్థాయిలో 4,12,805, సెకండరీ స్థాయిలో 1,61,808 పాఠశాలలున్నాయి.
ప్రాథమిక స్థాయిలో 6,18,45,033 మంది విద్యార్థులుంటే, 6 నుంచి 8వ తరగతుల్లో 4,08,93,978 మంది, సెకండరీ స్థాయిలో 2,36,68,220 మంది, హయ్యర్ సెకండరీ తరగతుల్లో 1,64,17,949 మంది ఉన్నారు. ఇలా తరగతులు పెరుగుతున్నకొద్దీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. బడ్జెట్ కేటాయిం పులకు తగ్గట్టు ఖర్చులు లేకపోవడం ప్రధాన కారణంగా నివేదికలు లిపాయి. హయ్యర్ సెకండరీ స్కూళ్లను పెంచాలని కమిటీ తెలిపింది.