కంగారూలకు ఝలక్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్
‘ఈ టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుందా? లేక ఐదు రోజులు సాగుతుందా?’ ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్ సారథి నజ్ముల్ హోసేన్‌కు ఫస్ట్ టెస్టు ప్రారంభానికి ముందు విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్న ఇది. కట్ చేస్తే.. డార్విన్ వేదికగా గురువారం ఆరంభమైన ఫస్ట్ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు బంగ్లా పేసర్లు ఊహించని షాకిచ్చారు.
- హసన్‌కు ఆరు వికెట్లు
డార్విన్ : ‘ఈ టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుందా? లేక ఐదు రోజులు సాగుతుందా?’ ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్ సారథి నజ్ముల్ హోసేన్‌కు ఫస్ట్ టెస్టు ప్రారంభానికి ముందు విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్న ఇది. కట్ చేస్తే.. డార్విన్ వేదికగా గురువారం ఆరంభమైన ఫస్ట్ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు బంగ్లా పేసర్లు ఊహించని షాకిచ్చారు. పిచ్‌పై ఉన్న పచ్చిక, స్థానిక వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంతితో చెలరేగి కంగారూలను 198 రన్స్‌కే కుప్పకూల్చారు. యువ పేసర్ హసన్ మహ్ముద్ (6/55) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేయగా ఎబాదత్ (2/39), టస్కిన్ అహ్మద్ (2/55) తలా రెండు వికెట్లు పడగొట్టారు. స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 71) టాప్ స్కోరర్. ఆసీస్ టాపార్డర్‌లో ట్రావిస్ హెడ్ (22), వెదరాల్డ్ (23), కామెరూన్ గ్రీన్ (13), మార్నస్ లబూషేన్ (1) బంగ్లా పేసర్ల ధాటికి తేలిపోయారు.
లంచ్ విరామానికే 74/4తో నిలిచిన ఆతిథ్య జట్టును స్మిత్, క్యారీ (19) నిలబెట్టే యత్నం చేశారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 56 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించే పనిలో ఉండగా ఎబాదత్.. క్యారీని పెవిలియన్‌కు పంపి కంగారూలకు కళ్లెం వేశాడు. ఆ తర్వాత వచ్చిన లోయరార్డర్ కూడా చేతులెత్తేసింది. కాగా బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో మీర్పూర్ (2017లో) టెస్టులో 217 రన్స్ చేయడమే ఇప్పటిదాకా అత్యల్పం. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన బంగ్లా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి నిలకడగా ఆడుతున్నది. ఆసీస్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు ఒక వికెట్ నష్టానికి 96 రన్స్ చేసింది. తాంజిద్ (32 బ్యాటింగ్ ), మోమినుల్ (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

