Elephants Trampled | ఏనుగుల దాడి.. ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురి మృతి
Elephants Trampled | ఏనుగుల మంద గ్రామాల్లో సంచరిస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆ ఏనుగులు దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురు వ్యక్తులను తొక్కి చంపాయి. దీంతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
రాంచీ: ఏనుగుల మంద గ్రామాల్లో సంచరిస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆ ఏనుగులు దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురు వ్యక్తులను తొక్కి చంపాయి. దీంతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. (Elephants Trampled) జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ఏనుగుల మంద గ్రామాల్లో సంచరిస్తున్నది. ఏనుగులు పలువురిపై దాడి చేస్తున్నాయి.
కాగా, గురువారం రాత్రి చుర్చు బ్లాక్‌లోని గోండ్వార్ గ్రామంలోకి ఆ ఏనుగులు ప్రవేశించాయి.
శుక్రవారం తెల్లవారుజామున ఒక పూరింటిపై దాడి చేశాయి. ఆ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరిని తొక్కి చంపాయి. గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు.
ఏనుగుల మంద గత కొన్ని రోజులుగా బొకారో, రామ్‌గఢ్, హజారీబాగ్ జిల్లాల్లో తిరుగుతున్నదని హజారీబాగ్ తూర్పు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) వికాస్ కుమార్ ఉజ్వాల్ తెలిపారు. దీనికి ముందు బొకారో జిల్లాలో కూడా ప్రాణ నష్టం కలిగించాయని చెప్పారు. ఏనుగుల మందను అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Multiple people of Gondwar village in Jharkhand’s Hazaribagh district were trampled to death after a herd of wild elephants rampaged through the village, breaking down several houses. pic.twitter.com/7lZDVugZjY
— ANI (@ANI) February 13, 2026
Also Read:
Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు
Woman Kills Mother | చేతబడి వల్ల తండ్రి మరణించాడన్న జ్యోతిష్కుడు.. తల్లిని చంపిన కుమార్తె
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

