లక్నో: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడు మనస్థాపం చెందాడు. ప్రేమికుల దినోత్సవం రోజున రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రియురాలు, ఆమె స్నేహితుడు కలిసి అతడ్ని హత్య చేసినట్లు యువకుడి కుటుంబం ఆరోపించింది. (teen boy dies by suicide) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల అమన్ గిరి ఇంటర్ చదువుతున్నాడు. ఎన్డీఏ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఎన్డీయే కోచింగ్‌కు వస్తున్న యువతి అతడికి పరిచయమైంది. దీంతో ఎనిమిది నెలలుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు.
కాగా, ఆ జంట మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆ యువతి బ్రేకప్ చెప్పింది. మరో వ్యక్తితో ఆమె రిలేషన్లో ఉన్నది. అయితే బ్రేకప్ భరించలేని అమన్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం రోజైన శనివారం తన రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అమన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. యువతితో బ్రేకప్ వల్ల తాను చనిపోతున్నట్లు అతడు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ప్రియురాలు, ఆమె స్నేహితుడు కలిసి అమన్‌ను హత్య చేశారని అతడి కుటుంబం ఆరోపించింది. అతడ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తల్లి నగలు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి
Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది
car rams trailer | కార్గో లారీని ఢీకొట్టిన కారు.. మహిళతో సహా ఐదుగురు మృతి