జైపూర్: కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్ నిద్రలో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (car rams trailer) రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఒక కుటుంబం తీర్థయాత్ర కోసం కారులో బయలుదేరింది. ఫిబ్రవరి 13న ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని వారు దర్శించారు. ఆ తర్వాత రాజస్థాన్లోని ఖాతు శ్యామ్ జీ ఆలయానికి కారులో ప్రయాణమయ్యారు.
కాగా, శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కోట–జైపూర్ జాతీయ రహదారి 52పై ముందు వెళ్తున్న కార్గో లారీని ఆ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి చనిపోయాడు.
మరోవైపు మృతులను రేష్మా శ్రీవాస్తవ, పియూష్ రాయ్, రాహుల్ రాజక్, షాను, డ్రైవర్ అనురాగ్గా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన నివాసితులని తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Rahul Gandhi | రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చ
Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి
Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్లో శవమై తేలింది