హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్-26 పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కే రాజేందర్ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 5న మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ కే ప్రతాప్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించారు.