Dhruv Jurel | ఆ రోజు యశస్వీ తప్పేమీ లేదు.. మైదానంలో గొడవకు అసలు కారణమిదే..!
Yashasvi Jaiswal : శ్రీలంక పర్యటనలో కొలంబో టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), బౌలర్ అసితా ఫెర్నాండో (Asitha Fernando)ల మధ్య మాటల యుద్ధం చివరకు జరిమానాకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ రోజు తప్పు ఎవరిది? ఎవరు హద్దు మీరారు? అనేది తాజాగా బయటపడింది.
Yashasvi Jaiswal : శ్రీలంక పర్యటనలో కొలంబో టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), బౌలర్ అసితా ఫెర్నాండో (Asitha Fernando)ల మధ్య మాటల యుద్ధం చివరకు జరిమానాకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ రోజు తప్పు ఎవరిది? ఎవరు హద్దు మీరారు? అనేది తాజాగా బయటపడింది. యశస్వీ ఔటైనప్పుడు నాన్ స్ట్రయికర్‌గా ఉన్న ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగిందో చెప్పాడు. అర్ధ శతకానికి చేరువైన యశస్వీనిన ఔట్ చేసిన ఫెర్నాండో నోరు పారేసుకోవడంతోనే ఇద్దరి మధ్య గొడవ మొదలైందని జురెల్ వెల్లడించాడు.
కొలంబో టెస్టు సందర్భంగా తొలి రోజు మైదానంలో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్, శ్రీలంక పేసర్ అసితా ఫెర్నాండోలు గొడవ పడిన విషయం తెలిసిందే. కానీ, ఈ వివాదంలో తప్పంతా లంక బౌలర్‌దే అని ధ్రువ్ జురెల్ అంటున్నాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జురుల్ కొలంబో టెస్టు తొలి రోజు గొడవలో యశస్వీ హద్దు మీరలేదని చెప్పాడు. ఆరోజు యశస్వీతో నాన్ స్ట్రయికర్‌గా క్రీజులో ఉన్న జురెల్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎలా మొదలైందో వివరించాడు.
🚨Vo bohot gandi gaaliyan de raha tha – Dhruv Jurel on Yashasvi Jaiswal-Asitha Fernando fight in Colombo Test🤯
Dhruv Jurel said :🗣️
“When he got out, he was quietly walking towards the dressing room. He didn’t say anything, which you might have noticed in the footage as well.… pic.twitter.com/HhmGgksJCp
— Akshat (@Cricketmythos) September 25, 2026
‘యశస్వీ ఔటయ్యాక వెనక్కి తిరిగి చూడకుండా పెవిలియన్ వైపు వెళ్తున్నాడు. అతడేమీ అనలేదు. వీడియో చూస్తే.. యశస్వీ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. శ్రీలంక పేసర్ అతడిని ఏదో తిడుతున్నాడు. దాంతో.. అతడు ఆగకుండా నన్నుదుర్భాషలాడుతున్నాడు అని యశస్వీ నాతో చెప్పాడు. అసితా వైపు వెళ్లి నువ్వు నా వికెట్ తీశాడు. అందుకు అందరిలా సంబురాలు చేసుకో. అంతేతప్ప అనవసరంగా నోరు జారకు అని అన్నాడు. అందుకు లంక పేసర్ ఇంకా రెచ్చిపోయాడు. దాంతో. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా చాలా దగ్గరగా వచ్చారు. ఆ గొడవకు కారణం అసితానే. యశస్వీ తన జోన్లో తానుంటాడు. కానీ, ఎవరైనా కావాలని రెచ్చగొడితే మాత్రం ఊరుకోడు. ఎవరైనా మనల్ని అకారణంగా దుర్భాషలాడితే వారికి వారి స్టయిల్లోనే బదులిస్తాం కదా’ అని జురెల్ పేర్కొన్నాడు.
‘ఏం అంటున్నావు’ అని గుర్రుగా
ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమైనా.. భారత్‌కు శుభారంభమిచ్చిన యశస్వీ జైస్వాల్‌ను అసితా ఫెర్నాండో ఔట్ చేశాడు. 45 పరుగుల వద్ద ఉన్న అతడిని బౌల్డ్ చేసిన లంక పేసర్.. మాటల యుద్ధానికి తెరతీశాడు. దాంతో, యశస్వీకి కోపమొచ్చింది. పెవిలియన్ వెళ్లాల్సిన అతడు.. ‘ఏం అంటున్నావు’ అని గుర్రుగా ఫెర్నాండో వైపు నడిచాడు. ఫెర్నాండో సైతం తగ్గకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదయ్యేలా కనిపించింది.

అయితే.. పరిస్థితిని గమనించిన లంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా ఇద్దరిని నిలువరించి దూరం పంపించేశాడు. కానీ, మరునాడు కామెంటేటర్ హర్ష భోగ్లే.. ‘గొడవలు ఆటలో భాగమే. ఏది ఏమైనా యశస్వీ హద్దు మీరాడు. మీరు ఏం అనుకుంటున్నారు?’ అని పోలింగ్ పెట్టాడు. తన గురించి వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించిన ఓపెనర్.. మైదానంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని అన్నాడు. ఎవరైనా అనవసరంగా తమ జోలికొస్తే భారత జట్టు చూస్తూ ఊరుకోదని, తగిన బుద్ధి చెబుతుందని యశస్వీ స్పష్టం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

