హిమతేజ ధనాధన్
కొడిమెల హిమతేజ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో సత్తా చాటడంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ విజయంతో ముగించింది.
- ఒడిశాపై హైదరాబాద్ గెలుపు
కోల్ కతా: కొడిమెల హిమతేజ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో సత్తా చాటడంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ విజయంతో ముగించింది. ఎలైట్ గ్రూప్- డీ నుంచి సూపర్ లీగ్ దశకు అర్హత సాధించే అవకాశాన్ని ముందే కోల్పోయిన హైదరాబాద్ గురువారం జరిగిన ఆఖరి పోరులో ఐదు వికెట్లతో ఒడిశాపై గెలిచింది. 18 పాయింట్లతో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఒడిశా ఇచ్చిన 207 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అమన్ రావు (31), అభిరథ్ రెడ్డి(30), గణేశ్ (25) కూడా రాణించారు. తొలుత ఒడిశా ఓవర్లన్నీ ఆడి 206/8 స్కోరు చేసింది. ఆదిత్య రౌత్ (95) టాప్ స్కోరర్‌గా నిలవగా, హైదరాబాద్ బౌలర్ అజయ్ దేవ్ గౌడ్ మూడు వికెట్లు తీశాడు. హిమతేజకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గ్రూప్ నుంచి ముంబై, విదర్భ చెరో 26 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ముంబై 86 పరుగులతో ఉత్తరాఖండ్‌పై నెగ్గగా, విదర్భ 34 పరుగులతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

