స్ట్రీమింగ్ ఆపండి.. నెట్‌ఫ్లిక్స్‌కి కేంద్రం ఆదేశం
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 4న స్ట్రీమింగ్ కానున్న పాకిస్తాన్ వెబ్‌సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’కి భారత్‌లో బ్రేకులు పడ్డాయి. ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ని నిషేధించాలంటూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWA) ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 4న స్ట్రీమింగ్ కానున్న పాకిస్తాన్ వెబ్‌సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’కి భారత్‌లో బ్రేకులు పడ్డాయి. ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ని నిషేధించాలంటూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(AICWA) ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాసింది. స్ట్రీమింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దాంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అలర్టయింది. పాక్ కంటెంట్‌ని భారత్‌లో ప్రసారం కాకుండా చూసుకోవాలని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. పహల్గాం ఉద్రదాడి తర్వాత, గత ఏడాది మే 8న పాక్ కంటెంట్‌పై కేంద్రం ఇచ్చిన అడ్వైజరీకి నెట్‌ఫ్లిక్స్ కట్టుబడి ఉండాలని సదరు మంత్రిత్వశాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకెళితే..
గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పాక్ కంటెంట్‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. పాక్‌లో రూపొందే వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు వంటి కంటెంట్‌ని భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిజిటల్ మాధ్యమాలు వెంటనే తొలగించాలని నాడు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 4న స్ట్రీమింగ్ కానున్న పాక్ వెబ్‌సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’కి భారత్‌లో నో ఎంట్రీ కార్డ్ పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

