బయో మైనింగ్ నిర్వహించాలి
ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బయో మైనింగ్ ద్వారా నిర్వహిస్తున్న విధంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోనూ నిర్వహించాలని డిమండ్ వినిపిస్తోంది.
- డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ
శామీర్‌పేట, నవంబర్ 26: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బయో మైనింగ్ ద్వారా నిర్వహిస్తున్న విధంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోనూ నిర్వహించాలని డిమండ్ వినిపిస్తోంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ(అఖిలపక్షం) ఆధ్వర్యంలో జవహర్‌నగర్ చెన్నాపురం చౌరస్తాలో ఏర్పాటు చేసిన రిలే దీక్ష గురువారం 5వ రోజుకు చేరగా వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు.
వరంగల్, సిరిసిల్ల, ఖమ్మం ప్రాంతాల్లోని మున్సిపల్ కార్ప్పొరేషన్లో శాస్త్రీయ పద్ధతుల్లో బయోమైనింగ్ నిర్వహిస్తూ పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగిస్తూ ఎప్పటి చెత్తను అప్పుడే క్లీస్ చేస్తున్నారని గుర్తుచేశారు.కానీ జవహర్‌నగర్ డంపింగ్ యా ర్డులో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందన్నారు. హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే చెత్తను నిలిపివేసి బయోమైనింగ్ ద్వారా వివిధ రకాల వస్తువుల ఉత్పత్తి చేయాలని, పేరుకుపోయిన గుట్టని అంచలంచలుగా తొలగించి క్లీన్ చేసి పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

