‘మనుచరిత్ర’లోని పద్యం స్ఫూర్తిగా..
అర్విన్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాల 369’. విజయ్‌కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తూ, ఎల్లయ్యతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
అర్విన్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాల 369’. విజయ్‌కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తూ, ఎల్లయ్యతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘అల్లసాని పెద్దన రాసిన ‘మనుచరిత్ర’లోని ‘అటజని కాంచే’ పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ రాశాను. 15దేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఈ ప్రయాణాన్ని ఎంతో ఆశ్వాదించాను. ప్రతి ఇంట్లో చర్చనీయాంశమయ్యే సినిమా ఇది. చాలా ఫ్రెష్ కంటెంట్.
టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. వారందరికీ థ్యాంక్స్’ అని దర్శక,నిర్మాత విజయ్‌కుమార్ కలివరపు అన్నారు. హీరో అర్విన్ తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి కంటెంటే మాట్లాడుతుంది. సినిమా క్రియేటివ్‌గా ఉంటుంది. ఒక్కనిమిషం కూడా బోర్ కొట్టదు’ అని నమ్మకంగా చెప్పారు. చిత్ర సమర్పకుడు, నటుడు వైవా హర్ష మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. అందుకే సమర్పిస్తున్నాను. కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇది’ అని చెప్పారు.ఇంకా నిర్మాత ఎల్లయ్య కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

