పోలీస్ కిష్టయ్య త్యాగం మరువలేనిది
అమరవీరుడు పోలీస్ కిష్టయ్య త్యాగం మరువలేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొనియాడారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను, వారి కుటుంబాల త్యాగాలను జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు.
- కరీంనగర్లో కిష్టయ్య వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 26: అమరవీరుడు పోలీస్ కిష్టయ్య త్యాగం మరువలేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొనియాడారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను, వారి కుటుంబాల త్యాగాలను జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, వారికి ఏ చిన్న కష్టం వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గురువారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పోలీస్ కిష్టయ్య 17వ వర్ధంతి కార్యక్రమ పోస్టర్‌ను ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి గంగుల ఆవిషరించారు. డిసెంబర్ 1న నిర్వహించనున్న పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులర్పించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం పోలీస్ కిష్టయ్య చేసిన ఆత్మబలిదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

