లెక్కల జోలికి వెళ్లకుండా చేసిన సినిమా
‘నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా ‘అలియాస్ రుక్మిణి’. కమర్షియల్ లెక్కల జోలికి వెళ్లకుండా, కథ నచ్చి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. ఆడియన్స్‌కి కూడా సినిమా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాను. దీప్తి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్.
‘నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా ‘అలియాస్ రుక్మిణి’. కమర్షియల్ లెక్కల జోలికి వెళ్లకుండా, కథ నచ్చి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. ఆడియన్స్‌కి కూడా సినిమా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాను. దీప్తి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. ఒక బిడ్డను తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, ఈ సినిమాను దీప్తి అంత జాగ్రత్తగా చూసుకున్నారు. మా డైరెక్టర్ మురళి తెలుగు సినిమాకు ఒక రాజ్‌కుమార్ హిరానీ. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సినిమా చూశాక ఆడియన్స్ కూడా అదే ఫీలవుతారు. టీమ్ అంతా మనసుపెట్టి పనిచేసింది. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’ అని హీరో నితిన్ ఆశాభావం వెలిబుచ్చారు.
ఆయన హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’. ఆఫియా సయ్యద్ కథానాయిక. ‘దండోరా’ఫేం మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి గంటా నిర్మించిన ఈచిత్రం డిసెంబర్ 4న విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడారు. ఇష్టపడి, కష్టపడి తీసిన సినిమా ఇదని, కచ్ఛితంగా ఓ అందమైన సినిమాను చూడబోతున్నారని దర్శకుడు మురళీకాంత్ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

