Manipur | కల్లోలిత ప్రాంతాలుగా నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్.. ఏఎఫ్ఎస్పీఏ చట్టం ఆరు నెలలు పొడిగింపు
Manipur : నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లకు కల్లోలిత ప్రాంత హోదాను కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది.
Manipur : నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లకు కల్లోలిత ప్రాంత హోదాను కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. దీంతో ఇక్కడ ఏఎఫ్ఎస్పీఏ చట్టం ఇంకో ఆరు నెలలపాటు అమలుకానుంది. ఈ అంశంపై శుక్రవారం కేంద్ర హోం వ్యవహారాల శాఖ ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఎఫ్ఎస్పీఏ అంటే సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం. నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో ఇప్పటికే ఈ చట్టం అమలవుతోంది.
ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో శాంతియుత పరిస్థతులు నెలకొనకపోవడంతో మరో ఆరు నెలలు ఈ చట్టాన్ని కేంద్రం పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ చట్టం అమలవుతుంది. దీని ప్రకారం నాగాలాండ్‌లోని తొమ్మిది జిల్లాలు పూర్తిగా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అలాగే, ఇతర ఐదు జిల్లాల్లోని 21 పోలీస్ స్టేషన్లలో ఈ చట్టం అమలవుతుంది. మణిపూర్‌లోని మొత్తం రాష్ట్రాన్ని ఈ చట్టం పరిధిలోఇక తెచ్చారు. అయితే, 13 ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం మినహాయింపు ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరాప్, చంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలను కూడా కల్లోలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది.
అలాగే, నమ్సాయ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కూడా ఈ చట్టం కిందికి తెచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ చట్టం అమలవుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే, వచ్చే ఏడాది మొత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి చట్టాన్ని తొలగిస్తామని కేంద్ర హోం శాఖ ఇటీవల ప్రకటించింది. ఏఎఫ్ఎస్పీఏ చట్టం ప్రకారం భద్రతా బలగాలకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. నిత్యం ఘర్షణలతో ఉండే ప్రాంతాల్లో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చట్టం అమలు చేస్తుంది. ఈ చట్టం అమలైతే ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై సైన్యం ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చు.
నిర్బంధించడంతోపాటు వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. అలాగే, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, స్వాధీనం చేసుకోవడం చేస్తారు. ఎవరైనా ఆయుధాలు కలిగి ఉంటే అవసరమైతే వారిని కాల్చి చంపే హక్కు కూడా ఉంటుంది. అలాగే, సంబంధిత భద్రతా సిబ్బందిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

