Anil Vij | ‘నా ఆదేశాన్ని పాటించాలి’.. మహిళా పోలీస్ అధికారిణిపై మంత్రి ఆగ్రహం
Anil Vij | తన ఆదేశాన్ని పాటించాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ అన్నారు. ఒక పోలీస్‌ను సస్పెండ్ చేయాలన్న తన ఆదేశాన్ని నిరాకరించిన మహిళా పోలీస్ అధికారిణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: తన ఆదేశాన్ని పాటించాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ (Anil Vij) అన్నారు. ఒక పోలీస్‌ను సస్పెండ్ చేయాలన్న తన ఆదేశాన్ని నిరాకరించిన మహిళా పోలీస్ అధికారిణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కైతాల్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఫిర్యాదుల పరిష్కార కమిటీ సమావేశంలో మంత్రి అనిల్ విజ్ పాల్గొన్నారు. భూ వివాదం అంశంలో ఏఎస్ఐ అధికారి కేసు నమోదు చేయడం లేదని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
కాగా, ఈ అంశంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న తన ఆదేశాలను ఆ పోలీస్ అధికారి పట్టించుకోలేదని మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ఏఎస్ఐను సస్పెండ్ చేయాలని సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ ఉపాసనను ఆయన ఆదేశించారు. దీనికి ఆమె నిరాకరించారు. ‘అతడ్ని సస్పెండ్ చేసే అధికారం నాకు లేదు. ఈ కేసులో సస్పెన్షన్ ఆర్డర్‌ను కురుక్షేత్ర ఎస్పీ జారీ చేయవచ్చు’ అని తెలిపారు.
మరోవైపు ఇది విన్న మంత్రి అనిల్ విజ్, డీఎస్పీ ఉపాసనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లేచి గది నుంచి వెళ్లిపో’ అని కఠినంగా అన్నారు. ‘ప్రతి పనిలోనూ నువ్వు ఇలాగే చేస్తావు. అతడ్ని సస్పెండ్ చేయాలని నిన్ను ఆదేశిస్తున్నా. నువ్వు డీజీపీకి లేఖ రాయి. నేను నీకు చెప్తున్నా. నువ్వు నా ఆదేశాన్ని అమలు చేయాలి. హర్యానా అంతా నా ఆదేశాన్ని పాటిస్తుంది’ అని అన్నారు.
ఇంతలో కైతాల్ డిప్యూటీ కమిషనర్ అపరాజిత జోక్యం చేసుకున్నారు. ఏఎస్ఐను సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని డీఎస్పీ చెబుతున్నారని వివరించారు. ‘ఆ ఏఎస్ఐను సస్పెండ్ చేయాలని డీజీపీకి మీరు రాయండి. (నా ఆదేశాన్ని) ఎవరు వినరో నేను చూస్తా’ అని డీఎస్పీ ఉపాసన వైపు చూస్తూ మంత్రి అనిల్ విజ్ అన్నారు. డీజీపీకి లేఖ రాస్తానని ఆమె చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Haryana Cabinet Minister Anil Vij
Vs
Kaithal SP IPS Upasana
Well Done Guys, Drama Rukna Nahi Chaiye.pic.twitter.com/GrzdmuVJoH— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) February 13, 2026
Also Read:
Rahul Gandhi | రైతు సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చ
Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి
teen boy dies by suicide | ప్రియురాలితో బ్రేకప్.. వాలంటైన్స్ డే రోజున యువకుడు ఆత్మహత్య
Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

