Srisailam | శ్రీశైలానికి (Srisailam) భక్తులు(Devotees) పోటెత్తారు. వారాంతపు సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ తరలి వచ్చారు. భక్తుల రద్దీ కారణంగా అధికారులు ఆదివారం విరామ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేశారు. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే మనమిత్ర,వాట్సాప్ ఆన్లైన్లో,స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి నిర్దిష్ట వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతినిస్తున్నారు.
క్యూలైన్లో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకే స్పర్శ దర్శనం రద్దు చేస్త కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కాగా, శ్రీశైలంమల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.దీంతో ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic ,) ఏర్పడింది.