భోపాల్: అటవీశాఖ అధికారితోపాటు మహిళపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. పారిపోయిన అతడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల్లో గాయపడిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్, ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (Man Shoots Deputy Forest Ranger, Hangs) మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో వాంఖేడి గ్రామంలోని అటవీ శాఖకు చెందిన అమరావద్ నర్సరీ వద్దకు మాజీ ఉద్యోగి పురాన్ అలియాస్ గుడ్డా లోధి వచ్చాడు. మూడేళ్ల కిందట అతడు అక్కడ పని చేశాడు. అయితే దురుసు ప్రవర్తన వల్ల ఉద్యోగం నుంచి అతడ్ని తొలగించారు. అప్పుడప్పుడు అక్కడకు వచ్చి తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరేవాడు.
కాగా, ఆ నర్సరీలో ఉన్న డిప్యూటీ రేంజర్ రాకేష్ శర్మను పురాన్ పలకరించాడు. గౌరవంగా ఆయన కాళ్లకు మొక్కాడు. తనను తిరిగి పనిలో చేర్చుకోమని అడిగాడు. అయితే అతడి ప్రవర్తన వల్ల ఆ అధికారి నిరాకరించారు. దీంతో పురాన్ ఆగ్రహంతో రగిలిపోయాడు. వెంట తెచ్చిన దేశీయ తుపాకీతో డిప్యూటీ రేంజర్ రాకేష్ శర్మ వీపుపై కాల్పులు జరిపాడు. నర్సరీలో పని చేసే సుమన్ బాయిని కూడా గన్తో కాల్చాడు.
మరోవైపు మరో ఉద్యోగి అయిన దల్చంద్ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. పురాన్పై అతడు రాళ్లు విసిరాడు. దీంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత సమీపంలోని చెట్టుకు పురాన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ రేంజర్ రాకేష్ శర్మ, నర్సరీ ఉద్యోగిని సుమన్ బాయిని తొలుత రైసెన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిద్దరిని భోపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిద్దరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, కాల్పులు జరిగిన ప్రాంతం సమీపంలోని చెట్టుకు వేలాడుతూ కనిపించిన పురాన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు తరలించారు. కాల్పులకు వినియోగించిన దేశీయ తుపాకీని సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సంఘటనలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: భర్తను మెడ వరకు పూడ్చిపెట్టిన భార్య.. శివలింగం మాదిరిగా తలపై అభిషేకం
Woman Fights Off Bear | ఎలుగుబంటితో పోరాడి.. భర్తను కాపాడిన భార్య
Watch: పాత్రలో ఇరుక్కున్న బాలుడి తల.. తర్వాత ఏం జరిగిందంటే?
Indore Woman Murder | ‘ఏది జరుగాలో అది జరిగింది’.. ప్రియురాలి హత్యపై నవ్వుతూ నిందితుడు