లక్నో: ఒక వ్యక్తి ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడాడు. తొలుత ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కుటుంబం కుదిర్చిన మహిళతో అతడికి పెళ్లి జరిగింది. (2 brides in a month) ఏడాది తర్వాత రెండు పెళ్లిళ్ల విషయం అతడి భార్యలకు తెలిసింది. వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రామకృష్ణ దూబే అలియాస్ రాహుల్ ఒక డెలివరీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2024 నవంబర్‌లో ప్రియురాలు ఖుష్బూను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల రోజుల్లోనే కుటుంబం కుదిర్చిన శివంగినితో అతడికి పెళ్లి జరిగింది.
కాగా, డెలివరీ బాయ్‌గా పని చేసే రామకృష్ణ ఎక్కువగా బయటే ఉండేవాడు. దీంతో సుమారు ఏడాది పాటు రెండు చోట్ల ఇద్దరు భార్యలతో జీవనం సాగించాడు. ఈ నేపథ్యంలో తొలి భార్య ఖుష్బూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఒక్క ఫోన్ కాల్ రామకృష్ణ జీవితాన్ని తారుమారు చేసింది. ఒక రోజు మధ్యాహ్నం ఖుష్బూ తన భర్తకు ఫోన్ చేసింది. అనుకోకుండా రెండో భార్య శివంగి ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. రామకృష్ణ భార్యనని ఖుష్బూ చెప్పడంతో వారిద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తన పెళ్లి ఫొటోలను శివంగికి ఆమె పంపింది. దీంతో రామకృష్ట రెండు పెళ్లిళ్ల విషయం ఇద్దరు భార్యలకు తెలిసిపోయింది.
మరోవైపు ఖుష్బూ, శివంగి కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. భర్త రామకృష్ణ తమ ఇద్దరిని పెళ్లి చేసుకుని మోసగించినట్లు ఆరోపించారు. పెళ్లిళ్లకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలు చూపించారు. ఈ నేపథ్యంలో బహు భార్యత్వం కింద రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Also Read:
Omar Abdullah | ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలను దోషులుగా చూస్తున్నారు.. ఒమర్ అబ్దుల్లా
Bengaluru cash van loot | ప్రభుత్వ అధికారులుగా పేర్కొని.. క్యాష్ వ్యాన్ నుంచి రూ.7 కోట్లు లూటీ
Bombay High Court | ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి బెదిరించడం క్రూరత్వమే: బాంబే హైకోర్టు