బెంగళూరు: కొందరు వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా పేర్కొన్నారు. బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తున్న వ్యాన్‌ను అడ్డుకున్నారు. డబ్బుతో సహా సిబ్బందిని తమ కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సిబ్బందిని కిందకు దించి సుమారు రూ.7 కోట్ల డబ్బుతో పారిపోయారు. (Bengaluru cash van loo) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం ‘భారత ప్రభుత్వం’ స్టిక్కర్ ఉన్న కారులో కొందరు వ్యక్తులు వచ్చారు. జేపీ నగర్‌లోని బ్యాంకు బ్రాంచ్ నుంచి డబ్బు తరలిస్తున్న క్యాష్ వ్యాన్‌ను వారు అడ్డుకున్నారు.
కాగా, ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలను ధృవీకరించాలని ఆ వ్యక్తులు తెలిపారు. క్యాష్ బాక్సులతోపాటు వ్యాన్ సిబ్బందిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించారు. డైరీ సర్కిల్ వైపు వెళ్లారు. అక్కడ సిబ్బందిని కారు నుంచి కిందకు దింపేశారు. బ్యాంకుకు చెందిన సుమారు రూ.7 కోట్ల డబ్బుతో పారిపోయారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆ క్యాష్ వ్యాన్ వద్దకు చేరుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. రూ.7 కోట్ల నగదుతో పారిపోయిన ఆ కారును గుర్తించేందుకు ఆయా రూట్లలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బెంగళూరు అంతటా వాహనాల తనిఖీ చేపట్టినట్లు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే ఈ సంఘటన బెంగళూరులో కలకలం రేపింది.
In a daring daylight robbery in #Bengaluru, miscreants posing as IT officials allegedly intercepted a van carrying cash for ATMs, threatened the staff and fled with over ₹7 crore in cash. https://t.co/2DnaeBCSxZ
📹Special arrangement pic.twitter.com/op4Az5blbv
— The Hindu-Bengaluru (@THBengaluru) November 19, 2025
Also Read:
Omar Abdullah | ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలను దోషులుగా చూస్తున్నారు.. ఒమర్ అబ్దుల్లా
Bombay High Court | ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి బెదిరించడం క్రూరత్వమే: బాంబే హైకోర్టు
Child Dies Of Toy In Chips Packet | చిప్స్ ప్యాకెట్లో చిన్న బొమ్మ.. అది మింగి బాలుడు మృతి