పాట్నా: బీహార్‌లో దారుణం జరిగింది. పెళ్లి వేదికపై వధువును ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ ఘటన బక్సర్‌లో జరిగింది. ఆమె లవర్ కాల్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని దీనబంధువుగా గుర్తించారు. పెళ్లి కుమార్తె 18 ఏళ్ల ఆర్తికుమారి .. వేదికపై కాబోయే భర్తతో ఉన్న సమయంలో.. అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి పిస్తోల్‌తో కాల్చాడు. వధువు చెల్లెలు .. బావకు తిలకం దిద్దుతున్న సమయంలో ఆమె వెనుక నుంచి షూట్ చేశాడు. ఆ టైంలో వేదిక వద్ద చాలా మంది అతిథులు ఉన్నారు. కొత్త జంట సమీపంలో అనేక మంది పిల్లలు ఉన్నారు.
అతి సమీపం నుంచి నిందితుడు ఫైరింగ్ చేశాడు. ఆర్తికుమారి కడుపులో బుల్లెట్ దిగింది. ఆమె బొడ్డు సమీపంలో గాయమైంది. స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు మాత్రం అక్కడ నుంచి పరారీ అయ్యాడు. సదర్ ఆస్పత్రిలో వధువుకు ప్రథమ చికిత్స చేసి, ఆ తర్వాత ఆమెను వారణాసి ట్రామా సెంటర్‌కు తరలించారు. ఆర్తికుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది. బహుశా లవ్ అఫైర్ వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
నిందిత వ్యక్తి గతంలో లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినట్లు అదనపు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ చంద్రన్ కుమార్ తెలిపారు. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు అన్వేషిస్తున్నారు.
🚨In a disturbing incident in Buxar, Bihar, an 18-year-old bride was shot during her jaimala ceremony by a rejected Lover. The injured bride remains in critical condition and is receiving treatment in the ICU. pic.twitter.com/s7OG4RrJ8u
— Aman Singh (@_AmanJi) February 25, 2026