Softsware Employee | కుత్బుల్లాపూర్: టెక్ మహీంద్ర (Tech Mahindra)లో భావన అనే ఉద్యోగిని సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తనను అకారణంగా కంపెనీ విధుల నుంచి తొలగించారని ఆమె గురువారం దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. అనారోగ్య సమస్యల కారణంగా మూడు రోజులు సెలవు తీసుకుంటే యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముందస్తుగా సమాచారం ఇచ్చినా అని చెప్పినా వినడం లేదని, వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని యాజమాన్యం వేధిస్తుందని ఆమె ఆరోపించారు. అనారోగ్య సమస్యలు ఉన్నా విధులకు హాజరుకావాలని ఈ-మెయిల్ ద్వారా ఆదేశించారని అన్నారు.