న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు సోమవారం పార్లమెంట్ మార్చ్(CJP Protest) నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులకు, సీజేపీ కార్యకర్తలకు మధ్య లాఠీఛార్జ్ జరిగింది. ఓ సందర్భంలో జంతర్ మంతర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న అదనపు డిప్యూటీ పోలీసు కమీషనర్ సందీప్ లంబా.. ఓ మహిళా సీజేపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. గుంపును చెదరగొట్టే క్రమంలో ఆయన ఓ మహిళా కార్యకర్తను తరిమారు. ఆ క్రమంలో ఆమెపై చేయి చేసుకున్నారు. అయితే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోకలే పోలీసు ఫిర్యాదు చేశారు. దీంతో అదనపు డీసీపీ సందీప్ లంబాను జంతర్ మంతర్ దగ్గర విధుల నుంచి తొలగించారు. ఆయన స్వంత పోలీసు స్టేషన్కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చేశారు. పిటీషనర్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఢిల్లీ హైకోర్టులో వాదించారు. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజక్ కైరాతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాది గోపాల్ తన పిటీషన్ వినిపించారు. పోలీసు ఆఫీసర్ సందీప్ లంబాకు సమన్లు ఇవ్వాలని ఆయన కోర్టులో కోరారు.
Sandeep Lamba, Additional DCP of Delhi Police, slapped a girl in the face on camera.
How can a male police officer even touch a female protestor, let alone slapping her?
I hope someone sue this arrogant prick. #CJPProtests pic.twitter.com/ttkgBicfZR
— Jaswinder kaur (@TheReal_Jassi) July 21, 2026