Human Refrigerator | మనుషులను చల్లబరిచే స్పెషల్ ఫ్రిజ్.. లోపలికెళ్లి కూర్చుంటే 5 నిమిషాల్లో కూల్..!
Human Refrigerator | వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు (Temparatures) పెరుగుతున్నాయి. వేసవి వచ్చిందంటే జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ (Japan) కు చెందిన ఓ సంస్థ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. తీవ్రమైన ఎండలో పనిచేసే కార్మికులకు తక్షణ ఉపశమనం కలిగించేలా 'హ్యూమన్ రిఫ్రిజిరేటర్ (Human Refrigerator)' గా పిలిచే ఒక పోర్టబుల్ కూలింగ్ బూత్‌ను అభివృద్ధి చేసింది.
Human Refrigerator : వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు (Temparatures) పెరుగుతున్నాయి. వేసవి వచ్చిందంటే జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ (Japan) కు చెందిన ఓ సంస్థ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. తీవ్రమైన ఎండలో పనిచేసే కార్మికులకు తక్షణ ఉపశమనం కలిగించేలా ‘హ్యూమన్ రిఫ్రిజిరేటర్ (Human Refrigerator)’ గా పిలిచే ఒక పోర్టబుల్ కూలింగ్ బూత్‌ను అభివృద్ధి చేసింది. దీనికి ‘డో హియిమాన్ బాక్స్ (Do Hiemon Box)’ అని నామకరణం చేశారు. ఈ బాక్సులోకి వెళ్లి కూర్చుంటే కేవలం ఐదు నిమిషాల్లోనే శరీరం చల్లబడుతుంది.
ట్రస్కో నకయామా కార్పొరేషన్ అనే పారిశ్రామిక సరఫరా సంస్థ దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేసిన ఈ బూత్, ఒక వ్యక్తి కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని అంతర్గత ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా.. శరీరాన్ని వేగంగా చల్లబరిచేందుకు అత్యంత కీలకమైన మెడ, తల, వీపు భాగాలపైకి ఐదు డిగ్రీల చల్లటి గాలిని ప్రసరింపజేస్తుంది. దీని తలుపులు మూసుకుని లోపల కూర్చోవడం ద్వారా.. పని ప్రదేశం మొత్తాన్ని ఏసీ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తిగతంగా సేదతీరవచ్చు.
అంతేకాదు, ఎక్కువసేపు చల్లదనానికి గురై అనారోగ్యానికి గురికాకుండా 20 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా దీన్ని రూపకల్పన చేశారు. జపాన్‌లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో కార్మికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం వడదెబ్బ నివారణ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, బహిరంగ కార్యక్రమాల్లో వినియోగించడానికి వీలుగా దీనిని రూపొందించారు. సాధారణ స్పాట్ ఏసీలతో పోలిస్తే ఇది సగం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది.
ఈ ఫ్రిజ్ నిర్వహణ ఖర్చు గంటకు కేవలం 16 యెన్లు (సుమారు 11 అమెరికన్ సెంట్లు) మాత్రమేనట. దీని రిటైల్ ధర సుమారు 1.5 మిలియన్ యెన్లు కాగా.. దీనిని అద్దెకు తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉందట. పని ప్రదేశాల్లో కార్మికులను వడదెబ్బ బారి నుంచి కాపాడేందుకే ఈ ‘హ్యూమన్ రిఫ్రిజిరేటర్’ ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇది వైద్య పరికరం కానప్పటికీ, విధుల మధ్యలో సేదతీరడానికి ఒక అదనపు భద్రతా చర్యగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

