Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!
Health News | రోజుకు ఐదు కప్పుల వరకు కాఫీ (Coffee) తాగడం సురక్షితమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పెద్ద వయసువాళ్లు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ (Caffeine) తీసుకోవడం సురక్షితమే. అంతకుమించి కెఫీన్ తీసుకోకుండా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అదుపులో ఉంటుంది.
Health News : రోజుకు ఐదు కప్పుల వరకు కాఫీ (Coffee) తాగడం సురక్షితమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (American Health Assossiation) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పెద్ద వయసువాళ్లు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ (Caffeine) తీసుకోవడం సురక్షితమే. అంతకుమించి కెఫీన్ తీసుకోకుండా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అదుపులో ఉంటుంది. 400 మిల్లీ గ్రాముల కెఫీన్ 8-ఔన్సుల కెఫీన్ ఉన్న ఐదు కప్పుల కాఫీకి సమానం. అంటే రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తీసుకోవడం సురక్షితమేనని తాజా అధ్యయనం చెబుతోంది.
అయితే వ్యక్తులను బట్టి కెఫీన్ మోతాదుల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పీర్-రివ్యూడ్ జర్నల్ ‘సర్క్యులేషన్సలో ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాన్ని ప్రచురించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజా పరిశోధన ద్వారా కెఫీన్పైన, గుండె జబ్బులపైన ఆధారాలను పరిశీలిస్తోంది. చక్కెర లేదా క్రీమ్ కలపని బ్లాక్ కెఫిన్ కాఫీ ద్వారా రోజుకు 400 మిల్లీగ్రాములకు మించకుండా కెఫిన్ తీసుకోవడం మంచిదేనని అధ్యయనం చెబుతోంది. ఈ మోతాదుకు మించకుండా కెఫీన్ తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం లాంటి ప్రమాదాల ముప్పును కూడా తగ్గించుకోవచ్చని ఈ శాస్త్రీయ ప్రకటన బృందానికి అధ్యక్షుడు, శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్ర ప్రొఫెసర్ గ్రెగొరీ ఎం మార్కస్ చెప్పారు.
అయితే ఎనర్జీ షాట్స్ వంటి ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే అధిక మోతాదు కెఫీన్ గుండెపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుందని, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని మార్కస్ హెచ్చరించారు. కాఫీయే కెఫీన్‌కు ప్రధాన మూలమని, అందువల్ల కాఫీలో సహజంగా ఉండే ఇతర పదార్థాల ప్రభావాల నుంచి కెఫీన్ ప్రభావాలను వేరుచేసి చూడటం కష్టమని పరిశోధకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాఫీలో సాధారణంగా కలిపే చక్కెర, ఫ్లేవర్డ్ సిరప్లు, పాలు, క్రీమ్‌ల వంటి పదార్థాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చని తెలిపారు.
అయితే రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగడంవల్ల కొంతమందిలో గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం పెరగవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. సంకలితాలు లేని బ్లాక్ కెఫీన్ కాఫీని పరిమితికి మించకుండా తాగడంవల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం హైలైట్ చేసింది. అదే సమయంలో ఈ పరిశోధనలో భాగంగా చేసిన క్లినికల్ ట్రయల్స్ ప్రకారం.. కాఫీలోని కెఫీన్ గుండె లయలో తేడాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, అయితే గుండె అసాధారణంగా కొట్టుకునే ప్రమాదం కూడా పొంచివుందని వెల్లడైంది.
కెఫీన్ ఉన్న అన్ని ఉత్పత్తులు ఒకే విధమైన ప్రభావాన్ని చూపవని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా తయారుచేసే కాఫీలో ఒక ఫ్లూయిడ్ ఔన్సుకు 9.4-20.6 మిల్లీగ్రాముల కెఫీన్ ఉండగా, ఎనర్జీ డ్రింక్స్, ఎనర్జీ షాట్స్‌లో తరచుగా ఒక ఫ్లూయిడ్ ఔన్సుకు 40-69 మిల్లీగ్రాముల వరకు గణనీయంగా అధిక సాంద్రతలో కెఫీన్ ఉంటుంది. ఈ ఉత్పత్తులకు అధిక రక్తపోటును, అసాధారణ గుండె లయను పెంచే లక్షణం ఉంది. జీన్స్, జీవక్రియల పరిస్థితి, వయస్సు, మందులను బట్టి కెఫిన్ ప్రజలపై విభిన్నంగా ప్రభావం చూపుతుందని తాజా స్టడీ వెల్లడించింది. ఏదేమైనా కెఫీన్‌ను మితంగా తీసుకోవడం మంచిదని మార్కస్ చెప్పారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

