KTR | కుమ్మెర బాధితులకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న కేటీఆర్
KTR | నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు.
మహబూబ్‌నగర్ : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప ( Child Died ) కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) బుధవారం నాగర్‌కర్నూల్ ( Nagarkurnool ) జిల్లాలో పర్యటించారు.

మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకులు కుల వివక్ష చూపుతూ చాకలి చంద్రకళ కుటుంబంపై అమానుషంగా దాడికి దిగడంతో ,రెండు నెలల పాప తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే దాడికి గురైన బాధిత కుటుంబంపైనే కేసు నమోదు చేయడంతో వారంతా భయపడి గ్రామం వదిలి నాగర్‌కర్నూల్‌లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి.

కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ,శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు మర్రి జనార్ధన్ రెడ్డి, అలా వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుమ్మేర బాధితులకు సంఘీభావంగా దీక్షలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవు వేసి నివాళి అర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

