భువనేశ్వర్: చిప్స్ ప్యాకెట్లో చిన్న బొమ్మ ఉన్నది. నాలుగేళ్ల బాలుడు దానిని మింగాడు. గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హాస్పిటల్కు తరలిస్తుండగా మరణించాడు. (Child Dies Of Toy In Chips Packet) ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ముసుమహాపాడ గ్రామానికి చెందిన రంజిత్ ప్రధాన్ తన నాలుగేళ్ల కుమారుడు బిగిల్ కోసం ఒక షాపులో చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగా అందులో చిన్న తుపాకీ బొమ్మ ఉన్నది.
కాగా, తల్లిదండ్రులు దూరంగా ఉండగా ఆ బాలుడు చిన్న గన్ బొమ్మతో ఆడాడు. ఉన్నట్టుండి దానిని నోటిలో పెట్టుకుని మింగాడు. అది గొంతుకు అడ్డుపడటంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
మరోవైపు గమనించిన తల్లిదండ్రులు బిగిల్ గొంతులో ఇరుక్కున్న చిన్న బొమ్మ తుపాకీని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఆ బాలుడ్ని తీసుకెళ్లారు. అయితే బిగిల్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా, ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.
Also Read: