Allu Sirish | టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన వివాహ వేడుకలను గ్రాండ్‌గా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 6న నయనికతో ఏడు అడుగులు వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆయన, పెళ్లికి ముందే మరో ప్రత్యేక వేడుకను ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు అల్లు శిరీష్ స్వయంగా తెలిపారు. ఈ వేడుకకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని వెల్లడించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ సంబరాలు జరగనున్నాయి.
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహిస్తున్నా, ఇది టాలీవుడ్ ప్రముఖులకు ఇచ్చే గ్రాండ్ పార్టీగా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లికి నాలుగు రోజుల ముందు ఇలాంటి భారీ వేడుక నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా జనవరి 30, 31 తేదీల్లో దుబాయ్‌లో కూడా ఓ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగింది. ఆ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి గ్రాండ్‌గా వేడుకను ప్లాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా పార్టీ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు ఊపందుకున్నాయి.
వివాహ వేడుకల సందర్భంలో భాగంగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబులను కలిసి శుభలేఖలు అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 28న నయనికతో వివాహం జరుగుతుందని అధికారికంగా ప్రకటించిన అల్లు శిరీష్, ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మార్చి 6న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనుంది. ఏది ఏమైన పెళ్లికి ముందే టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్న అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు కూడా ఈ వేడుకల ఫోటోలు, వీడియోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.