Dental Health | దంతాల ఆరోగ్యానికి బ్రషింగ్ చేయడమే కాదు, వీటికి కూడా దూరంగా ఉండాలి
దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం రోజూ బ్రష్ చేయడం మాత్రమే కాదు, తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు ఆరోగ్యకరంగా అనిపించే కొన్ని పానీయాలు కూడా దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Dental Health | దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం రోజూ బ్రష్ చేయడం మాత్రమే కాదు, తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు ఆరోగ్యకరంగా అనిపించే కొన్ని పానీయాలు కూడా దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను డైట్లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బ్రిటిష్ డెంటల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం నిమ్మరసం కలిపిన తీపి టీ లేదా ఫ్లేవర్డ్ వాటర్‌ను తరచూ తాగడం వల్ల దంతాల ఎనామెల్ క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే వెనిగర్, ఊరగాయలు, అధిక ఆమ్లత్వం ఉన్న మందులను తరచూ తీసుకోవడం కూడా దంతాలు అరిగిపోవడానికి కారణాలుగా పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే జీర్ణాశయంలో అధిక ఆమ్లం ఏర్పడే సమస్యలు, కొన్ని ఆహార సంబంధిత రుగ్మతలు కూడా దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే అవకాశం ఉంటుందని అధ్యయనం తెలిపింది. స్పోర్ట్స్ డ్రింక్స్, శీతల పానీయాలు వంటి అధిక ఆమ్లత్వం కలిగిన పానీయాలను తరచూ తీసుకోవడం కూడా దంతాలు అరిగిపోవడానికి కారణమవుతుంది.
దంతాల బలానికి ఆహారాలు..
కెనడియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం పాలు, మజ్జిగ, తాజా పండ్లు, పచ్చి కూరగాయలు, ప్లెయిన్ పెరుగు, చీజ్, కాటేజ్ చీజ్, గుడ్లు, నట్స్, విత్తనాలు వంటి ఆహారాలు దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. యాపిల్ దంతాల ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటి. ఇందులో నీరు, పీచు అధికంగా ఉండటం వల్ల సహజ శుభ్రపరిచే గుణం ఉంటుంది. అలాగే ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ లాలాజల ఉత్పత్తిని పెంచి, నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి క్యారెట్ నమలడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. లాలాజలం నోటిలోని ఆమ్లాలను తటస్థీకరించి, దంతాల ఎనామెల్‌ను రక్షించడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు, పాలకూర..
స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని పాలీఫినాల్స్ బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుని, నోటి పరిశుభ్రతను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. దీంతో దంతాల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. పాలకూరలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది దంతాల ఎనామెల్‌ను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని ఐరన్ దంతాలను మెరిసేలా ఉంచడంతోపాటు ఎనామెల్ అరిగిపోకుండా రక్షించడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

