లక్నో: తండ్రి పదేపడే తిట్టడంపై ఒక బాలుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. చెడు సహవాసాలపై మందలించి కొట్టడంతో హత్యకు కుట్రపన్నాడు. తన స్నేహితులతో కలిసి సూసైడ్ డ్రామా ఆడాడు. ఫార్మ్‌హౌస్‌కు తండ్రిని రప్పించి కాల్చి చంపాడు. (boy kills father with friends) దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మైనర్ బాలుడు 11వ తరగతి చదువుతున్నాడు. క్లాస్‌మేట్స్‌తో చెడు సహవాసం వల్ల తప్పుదారి పట్టాడు.
కాగా, కుమారుడు క్రమశిక్షణ తప్పడంపై రైతు అయిన తండ్రి తస్వీర్ సింగ్ పలుమార్లు తిట్టాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న ఇదే అంశంపై కొడుకును గట్టిగా మందలించడంతోపాటు కొట్టాడు. ఈ నేపథ్యంలో తండ్రిని హత్య చేసేందుకు ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో కలిసి ఆ బాలుడు కుట్ర పన్నాడు. సెప్టెంబర్ 20న ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తస్వీర్ సింగ్‌కు అతడ్ని ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. వెంటనే ఫార్మ్‌హౌస్ రావాలని చెప్పారు. అక్కడకు చేరుకున్న తండ్రిని ఆ యువకుడు పిస్టల్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తస్వీర్ సింగ్‌ను మీరట్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన సోదరుడు కశ్మీర్ సింగ్ ఫిర్యాదుతో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యపై గత రెండు నెలలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ రైతుకు ఎవరితో శతృత్వం లేకపోవడంతో ఎవరు హత్య చేశారు అన్నది పోలీసులకు అంతుపట్టలేదు.
కాగా, హత్యకు ముందు తస్వీర్ సింగ్‌ను ఫార్మ్ హౌస్‌కు రప్పించిన ఫోన్ కాల్‌పై పోలీసులు దృష్టి సారించారు. దర్యాప్తు తర్వాత మైనర్ బాలురైన ఇద్దరి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా తస్వీర్ సింగ్ కుమారుడే అతడ్ని కాల్చి చంపినట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.
అయితే పరారీలో ఉన్న ఆ యువకుడి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. తండ్రి హత్య కోసం వినియోగించిన దేశీయ పిస్టల్ నిందితుడి వద్దే ఉన్నట్లు తెలిసిందన్నారు. మైనర్ బాలుడి ఆచూకీ గుర్తించి అతడ్ని అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man prints fake notes | ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంట్లో నకిలీ నోట్లు ముద్రణ