భోపాల్: ఒక వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. ఆ అనుభవంతో ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తున్నాడు. (Man prints fake notes) వాటిని మార్కెట్లో చలామణి చేస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు లక్షలకుపైగా ఫేక్ కరెన్సీతో పాటు తయారీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 14న నిజాముద్దీన్ ప్రాంతంలో నకిలీ రూ.500 నోట్లతో ఒక వ్యక్తి తిరుగుతున్నాడని, వాటిని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ట్రాప్ చేసి ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అచ్చం నిజమైన కరెన్సీని పోలి ఉన్న 23 నకిలీ రూ.500 నోట్లు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాగా, భోపాల్‌లోని కరోండ్ ప్రాంతానికి చెందిన వివేక్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో అతడు పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్ పరిశీలించగా నకిలీ కరెన్సీ ఎలా తయారు చేయాలో వివరించే అనేక వీడియోలు కనిపించాయి. ఈ పరిశోధన, ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసిన అనుభవంతో ఇంట్లోనే నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు తెలుసుకున్నారు.
మరోవైపు వివేక్ యాదవ్ ఇంట్లో పోలీసులు సోదా చేశారు. రూ. 2,25,500 విలువైన 428 నకిలీ రూ.500 నోట్లు లభించాయి. ఈ ఫేక్ కరెన్సీతో పాటు తయారీకి వినియోగించే ఒక కంప్యూటర్, ప్రింటర్, పంచ్ మెషిన్, నోట్ కటింగ్ డైస్, జిగురు, స్క్రీన్ ప్లేట్లు, కట్టర్లు, స్పెషల్ పేపర్, పెన్సిల్స్, స్టీల్ స్కేల్, లైట్ బాక్స్, డాట్ స్టెప్పింగ్ ఫాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు ఆరు లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను వివేక్ యాదవ్ చలామణి చేసినట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Man, Live-In Partner Kill Colleague | స్నేహం చేయాలనుకున్న సహోద్యోగి.. హత్య చేసిన సహజీవన జంట
Rohini Acharya | రోహిణి ఆచార్య పేర్కొన్న.. సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు?
woman goes missing in Pak | భారతీయ మహిళ పాక్‌లో అదృశ్యం.. మతం మారి ఆ దేశ వ్యక్తితో పెళ్లి