woman goes missing in Pak | భారతీయ మహిళ పాక్‌లో అదృశ్యం.. మతం మారి ఆ దేశ వ్యక్తితో పెళ్లి
woman goes missing in Pak | పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్‌కు తిరిగి రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. (woman goes missing in Pak) అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్‌కు తిరిగి రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన 52 ఏళ్ల సరబ్జీత్ కౌర్, భర్త కర్నైల్ సింగ్ నుంచి విడాకులు తీసుకున్నది. ఆమెకు ఇద్దరు కుమారులు.
కాగా, గురునానక్ దేవ్ 555వ జయంతిని పురస్కరించుకుని భారత్‌కు చెందిన 1,900 మందికి పైగా యాత్రికుల బృందం నవంబర్ 4న వాఘా-అట్టారి సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని చారిత్రక గురుద్వారాలను వారు సందర్శించారు.
మరోవైపు నవంబర్ 13న ఈ బృందం భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే ఈ బృందంతో కలిసి వెళ్లిన సరబ్జీత్ కౌర్ పాకిస్థాన్‌లో అదృశ్యమైంది. ఇమ్మిగ్రేషన్ ఎగ్జిట్ క్లియరెన్స్ కోసం రిపోర్ట్ చేయలేదని పాకిస్థాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఆమె మిస్సింగ్‌పై దర్యాప్తు చేశారు.
కాగా, సరబ్జీత్ కౌర్ ఇస్లాం మతంలోకి మారి పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తన పేరును నూర్‌గా మార్చుకున్న ఆమె లాహోర్ సమీపంలోని షేక్‌పురాకు చెందిన నాసిర్ హుస్సేన్‌ను వివాహమాడింది. ఉర్దూలో ఉన్న ‘నిఖానామా’ (ఇస్లామిక్ వివాహ ఒప్పందం) కాపీ కూడా బయటపడింది.
మరోవైపు పాకిస్థాన్ పోలీసులు ఈ విషయాన్ని భారతీయ అధికారులకు తెలియజేశారు. దీంతో సరబ్జీత్ కౌర్, ఆమె కుటుంబం గురించి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లా నుంచి ఆమె పాస్‌పోర్ట్ పొందినట్లు గుర్తించారు. పాస్‌పోర్ట్‌లో మాజీ భర్త పేరుకు బదులు తండ్రి పేరు ఉన్నట్లు కనుగొన్నారు. మాజీ భర్త కర్నైల్ సింగ్ గత 30 ఏళ్లుగా బ్రిటన్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పాక్‌లో అదృశ్యమై మతం మారి అక్కడి వ్యక్తిని పెళ్లాడిన సరబ్జీత్ కౌర్ గురించి మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Bihar election results | ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు.. బీజేపీ, జేడీ(యూ)కి దక్కిన సీట్లు
RK Singh Suspended | బీహార్‌లో రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలు సస్పెండ్
Watch: ఖరీదైన కారులో వచ్చి.. వార్తాపత్రికను దొంగిలించిన వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

