భోపాల్: ఒక వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. న్యాయవాది కార్యాలయం బయట ఉన్న వార్తాపత్రికను దొంగిలించాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఆ న్యాయవాది ఫిర్యాదుతో న్యూస్‌పేపర్ దొంగను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. (Car Man Steals Newspaper) మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 12న ఉదయం 9.55 గంటల సమయంలో మహారాణా ప్రతాప్ కాలనీలో న్యాయవాది సంజీవ్ బిల్గయ్య తన కార్యాలయం ఛాంబర్లో సహోద్యోగితో ఒక కేసు గురించి చర్చిస్తున్నారు.
కాగా, న్యాయవాది ఛాంబర్ ముందు డిజైర్ కారు ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. మెల్లగా రెయిలింగ్ వద్దకు వచ్చాడు. లోపలకు చేతులు పెట్టాడు. అక్కడ ఉన్న వార్తాపత్రికను తీసేందుకు తొలుత ప్రయత్నించి విఫలమయ్యాడు. ముందుకు వంగి చేతిని మరింత ముందుకు చాచి ఆ న్యూస్‌పేపర్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కారు ఎక్కి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.
మరోవైపు అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో రూ.8 లక్షల కారులో వచ్చిన వ్యక్తి రూ.8 ధర ఉండే వార్తాపత్రికను చోరీ చేయడంపై న్యాయవాది సంజీవ్ విస్తూపోయాడు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో వచ్చి న్యూస్‌పేపర్‌ను చోరీ చేసిన దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मध्यप्रदेश में ₹10 लाख की गाड़ी से आया शख्स, वकील के घर चुरा ले गया 6 रुपए का न्यूज़पेपर. आदमी लाखों की कार से आता है और न्यूज़पेपर चुराकर भाग जाता है। हैसियत और आदत के बीच का फर्क शायद इस कार वाले चोर को बताने की जरूरत थी कि ये छह रूपए का न्यूज़ पेपर छह रूपए का ही मिलता है। pic.twitter.com/Pt7zqayQYp
— Uttam Hindu (@DailyUttamHindu) November 14, 2025
Also Read:
AAP Won Tarn Taran Bypoll | పంజాబ్‌లోని తర్న్ తరన్ ఉప ఎన్నికల్లో.. ఆప్ విజయం
Omar Abdullah | ఒమర్ అబ్దుల్లాకు షాక్.. ఆయన రాజీనామా చేసిన బుద్గామ్‌లో ఎన్సీ ఓటమి
Woman Kills Husband | మరిదితో వివాహేతర సంబంధం.. గొడ్డలితో నరికి భర్తను హత్య
Watch: ఎక్స్‌ప్రెస్ వేపై అదుపుతప్పిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?