చండీగఢ్: పంజాబ్‌లోని తర్న్ తరన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,091 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. (AAP Won Tarn Taran Bypoll) గతంలో శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి, ఆజాద్ గ్రూప్ నాయకురాలు సుఖ్విందర్ కౌర్ 30,558 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
కాగా, కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌బీర్ సింగ్ 27,571 ఓట్లతో మూడో స్థానంలో ఉండగా బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధుకు కేవలం 6,239 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.
మరోవైపు తర్న్ తరన్ ఉప ఎన్నికలో ఆప్ విజయంపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పని చేసే రాజకీయ పార్టీని పంజాబ్ ప్రజలు ఇష్టపడుతున్నట్లు ఈ గెలుపు ద్వారా స్పష్టమైందని తెలిపారు. పంజాబ్ మరోసారి ఆప్ పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసిందని అన్నారు. సీఎం భగవంత్ మాన్ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు.
Also Read:
Omar Abdullah | ఒమర్ అబ్దుల్లాకు షాక్.. ఆయన రాజీనామా చేసిన బుద్గామ్‌లో ఎన్సీ ఓటమి
Anant Kumar Singh | జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి.. మోకామా స్థానంలో గెలుపు
Woman Kills Husband | మరిదితో వివాహేతర సంబంధం.. గొడ్డలితో నరికి భర్తను హత్య
Watch: ఎక్స్‌ప్రెస్ వేపై అదుపుతప్పిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?