పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన అభ్యర్థి ఒక హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్నాడు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ జేడీ(యూ) అభ్యర్థి విజయం సాధించాడు. ఆ పార్టీకి చెందిన వివాదాస్పద నేత అనంత్ కుమార్ సింగ్ (Anant Kumar Singh), ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జాన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో జైలుకెళ్లాడు.
కాగా, తనకు పట్టున్న మోకామా స్థానంలో అనంత్ కుమార్ సింగ్ పోటీ చేశాడు. ఆయన జైలులో ఉన్నప్పటికీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అభ్యర్థి వీణా దేవిపై విజయం సాధించాడు. దీంతో అనంత్ కుమార్ సింగ్ ఇంటి వద్ద ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.
Patna, Bihar: JD(U) supporters celebrated at the residence of party candidate Anant Kumar Singh as he leads in the Bihar Assembly election vote counting pic.twitter.com/cD9rLijbK3
— IANS (@ians_india) November 14, 2025
Also Read:
Akhilesh Yadav | బీజేపీ పార్టీ కాదు, మోసగాడు.. ఇతర రాష్ట్రాల్లో ‘సర్’ ఆటలు సాగవు: అఖిలేష్ యాదవ్
Flipkart | ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ.. రూ.1.6 కోట్ల విలువైన 332 ఫోన్లు చోరీ
Watch: ఎక్స్‌ప్రెస్ వేపై అదుపుతప్పిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?