తిరువనంతపురం: ఫ్లిప్‌కార్ట్‌ను (Flipkart) నకిలీ కస్టమర్లు మోసగించారు. రూ.1.6 కోట్ల విలువైన 332 మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. ఈ మోసాన్ని గ్రహించిన ఫ్లిప్‌కార్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఆగస్ట్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య నకిలీ చిరునామాలు, వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి రూ. 1.61 కోట్ల విలువైన 332 మొబైల్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో నిందితులు ఆర్డర్ చేశారు. ఖరీదైన ఆపిల్ ఐఫోన్, శామ్సంగ్ గెలాక్సీ, వివో, ఐక్యూవోవో మోడల్స్ ఇందులో ఉన్నాయి.
కాగా, ఎర్నాకుళం జిల్లాలోని కంజూర్, కురుప్పంపడి, మెక్కడ్, మువట్టుపుళలోని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ హబ్స్ నుంచి 332 మొబైల్ ఫోన్స్ డెలివరీ అయ్యాయి. కంజూర్ హబ్ నుంచి రూ. 18.14 లక్షల విలువైన 38 ఫోన్లు, కురుప్పంపడి హబ్ నుంచి రూ. 40.97 లక్షల విలువైన 87 ఫోన్లు, మెక్కడ్ హబ్ నుంచి రూ. 48.66 లక్షల విలువైన 101 ఫోన్లు, మువట్టుపుళ హబ్ నుంచి రూ. 53.41 లక్షల విలువైన 106 ఫోన్ ఆర్డర్లు వచ్చాయి. అయితే డెలివరీ కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఆ మొబైల్ ఫోన్స్ అన్ని మాయమయ్యాయి.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఈ మోసాన్ని గ్రహించారు. రూ. 1.61 కోట్ల విలువైన 332 మొబైల్ ఫోన్స్ మిస్సింగ్‌పై ఎర్నాకుళం రూరల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంజూర్, కురుప్పంపడి, మెక్కడ్, మువట్టుపుళ ఫ్లిప్‌కార్ట్ హబ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సిద్ధిక్ కే అలియార్, జాస్సిమ్ దిలీప్, హరిస్ పీఏ, మహిన్ నౌషాద్‌లపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మోసంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Akhilesh Yadav | బీజేపీ పార్టీ కాదు, మోసగాడు.. ఇతర రాష్ట్రాల్లో ‘సర్’ ఆటలు సాగవు: అఖిలేష్ యాదవ్
Sena leader Sells footpath | పానీపూరీ విక్రేతకు.. ఫుట్‌పాత్ స్థలం అమ్మిన శివసేన నేత