తాండూర్ : ప్రమాదవశాత్తు చెరువులో ఎడ్ల బండి బోల్తాపడిన ఘటనలో ఎద్దు మృతి చెందగా, రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్( Tandur ) మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దాగం మల్లయ్య ( Dagam Mallaiah ) అనే రైతు గురువారం మధ్యాహ్నం తన చేను నుంచి ఎడ్ల బండితో శివారులోని పెద్ద చెరువుకు ఎద్దులకు నీళ్ళు తాగించెందుకు తీసుకెళ్ళాడు.
అక్కడ గుంత లోతుగా ఉండడంతో ఒక్కసారిగా ఎడ్లబండితో పాటు రైతు నీళ్లలో మునిగిపోయాడు. వెంటనే తేరుకున్న రైతు ఎడ్లబండిని వదిలి అతి కష్టం మీద నీళ్లలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో చెరువులో పడిన రెండు ఎద్దులలో ఒక ఎద్దు మృతి చెందగా, మరో ఎద్దు ప్రాణాలతో బయటపడింది.
మృతి చెందిన ఎద్దు విలువ రూ.70వేలు విలువ ఉంటుంది. రూ.30వేల విలువ గల ఎడ్లబండి సుజ్జునుజ్జు అయ్యింది. రైతు దాగం మల్లయ్యకు రూ.1లక్ష దాకా నష్టం వాటిల్లిం దని సంబంధిత అధికారులు స్పందించి, నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరారు.