లక్నో: బీజేపీ పార్టీ కాదని, మోసగాడని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయంపై ఆయన స్పందించారు. ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రతిపక్ష మహాకూటమి గెలుపును ప్రభావితం చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ ఆటలు ఇతర రాష్ట్రాల్లో సాగవని అన్నారు. ‘బీహార్‌లో ‘సర్’ ఆడిన ఆట ఇకపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ఎన్నికల కుట్ర ఇప్పుడు బయటపడింది’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో చేపట్టే ‘సర్’ ప్రక్రియ పట్ల తాము అప్రమత్తంగా ఉంటామని అఖిలేష్ యాదవ్ తెలిపారు. బీజేపీ ప్రణాళికలను అడ్డుకుంటామని అన్నారు. ‘బీజేపీ ఒక పార్టీ కాదు, మోసగాడు’ అని ఆయన ఆరోపించారు.
बिहार में जो खेल SIR ने किया है वो प. बंगाल, तमिलनाडू, यूपी और बाक़ी जगह पर अब नहीं हो पायेगा क्योंकि इस चुनावी साज़िश का अब भंडाफोड़ हो चुका है। अब आगे हम ये खेल, इनको नहीं खेलने देंगे।CCTV की तरह हमारा ‘PPTV’ मतलब ‘पीडीए प्रहरी’ चौकन्ना रहकर भाजपाई मंसूबों को नाकाम करेगा।…
— Akhilesh Yadav (@yadavakhilesh) November 14, 2025
Also Read:
Sena leader Sells footpath | పానీపూరీ విక్రేతకు.. ఫుట్‌పాత్ స్థలం అమ్మిన శివసేన నేత
Containers Collide, Catchs Fire | లారీల మధ్య నలిగిన కారు.. చెలరేగిన మంటలు, 8 మంది మృతి
Watch: కారు తనిఖీ చేసిన పోలీసులు.. డిక్కీలో నిద్రిస్తున్న వ్యక్తిని చూసి షాక్