న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంఘటన నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఒక కారును ఆపి చెక్ చేశారు. ఆ కారు డిక్కీ తెరిచారు. అందులో ఒక వ్యక్తి నిద్రిస్తుండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. (Man Sleeping Inside Car’s Trunk) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలింది. దేశవ్యాప్తంగా ఇది కలకలం రేపింది.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద భద్రతను పటిష్టం చేశారు. పలు చోట్ల వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సిగ్నేచర్ బ్రిడ్జి చెక్‌పాయింట్ వద్ద తిమార్పూర్ పోలీసులు ఒక కారును ఆపారు. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు నవ్వుతూ ఆ కారు నుంచి కిందకు దిగారు.
మరోవైపు ఆ కారు డిక్కీని పోలీసులు తెరిపించారు. అందులో నిద్రిస్తున్న వ్యక్తిని చూసి వారు షాక్ అయ్యారు. కారులో ప్లేస్ లేకపోవడంతో బంధువైన ఆ వ్యక్తి డిక్కీలో సర్దుకుని నిద్రించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వారిని హెచ్చరించి వదిలేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.
दिल्ली ब्लास्ट के बाद देश भर के अंदर चेकिंग तेज है,और शादियों के दिन भी चल रहे है।
ऐसे में शादी से लौट रहे पारिवार को जब दिल्ली पुलिस ने रोका तो,गाड़ी में जगह कम होने की वजह से “मामा के लड़के” को डिक्की में लेटाया हुआ था।
“ओये सत्यम खड़ा हो” 😃 pic.twitter.com/4PfEA5k47U
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) November 13, 2025
Also Read:
explosion at firecracker factory | బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు